పలాస రైల్వే స్టేషన్ లో బాలల హక్కులపై అవగాహన

55చూసినవారు
పలాస రైల్వే స్టేషన్ లో బాలల హక్కులపై అవగాహన
పలాస రైల్వే స్టేషన్ లో ఆర్పిఎఫ్, జిఆర్పి సిబ్బంది సమక్షంలో చైల్డ్ హెల్ప్ డెస్క్ వారు శుక్రవారం రైలు ప్రయాణికులకు 0 - 18 సంవత్సరముల లోపు బాల బాలికలు ఆపదలో ఉన్న ఎడల 1098 కు సమాచారం అందించాలని కోరారు. 1098 సేవలు గురించి, బాల కార్మికులు, తప్పిపోయిన పిల్లలు, అక్రమ రవాణాకు గురవుతున్న పిల్లలు మొదలగు వంటి అంశాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్పిఎఫ్ ఏఎస్ఐ బిశ్వాస్, కానిస్టేబుల్స్ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్