వజ్రపుకొత్తూరు మండలం ఒంకులూరు గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ అదుపుతప్పి కరెంటు స్తంభాన్ని అతివేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కాశిబుగ్గ పట్టణానికి చెందిన శివ(24) అనే యువకుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందగా సంత షణ్ముఖరావుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.