మెలియాపుట్టి మండలంలో శుక్రవారం సాయంత్రం వీచిన గాలి వానకు గోకర్ణ పురం పంచాయతీ సమీపంలో ఉన్న రంపకాన చిన్నహంస మార్గమధ్యలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా భారీ గాలి వాన రావడంతో 11 కెవి విద్యుత్ స్తంభాలు పంట పొలాల్లో పడి వైర్లు రోడ్డుపై పడ్డాయి అయితే. ఆ సమయంలో విద్యుత్తు సరఫరా లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వెంటనే విద్యుత్ శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టారు.