ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో గొట్టా బ్యారేజీకి వరద

82చూసినవారు
గత నాలుగు రోజులుగా ఏకధాటిగా పాతపట్నం నియోజకవర్గం వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు హిర మండలం వంశధార నది వద్ద గొట్టా బ్యారేజీకి వరద ఉధృతి అధికమైంది. మరో మారు సోమవారం వాతావరణ శాఖ మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హెచ్చరికలతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు వంశధార నది తీర ప్రాంతానికి రైతులు, మత్స్యకారులు వెళ్ళరాదని తెలిపారు.

సంబంధిత పోస్ట్