ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రతి బుధవారం ప్రజాదర్బార్ కార్యక్రమం చేపట్టనున్నట్లు పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు తెలిపారు. ఆదివారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ నెలలో ప్రతి బుధవారం ప్రజాదర్బార్ కార్య క్రమాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు.