వరద బాధితులకు తన వంతు సాయంగా ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయవాడ ఈస్ట్ 16వ డివిజన్లో మంగళవారం నష్టం అంచనాలో భాగంగా తనను నియమించారని పేర్కొన్నారు. ఈ క్రమంలో నష్టం అంచనాను వేయటమే కాకుండా నిరుపేదలకు తన వంతు నగదు సహాయం అందజేస్తున్నానని ఆయన తెలియజేశారు. పకడ్బందీగా నష్టం అంచనాను వేస్తున్నామని అన్నారు.