రైతులకు ప్రకృతి వ్యవసాయ సాగు లాభదాయకం మని పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. బుధవారం హిరమండలం మండలంలోని కొండరాగోలు లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ సాగు కు సంబంధించి తయారు చేసిన వివిధ రసాయానాలు ఆయన పరిశీలించారు.ఎమ్మేల్యే గోవిందరావు మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయ సాగుకు ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని తెలిపారు.