పాతపట్నం ఎస్. ఐ. బి. లావణ్య సోమవారం రాత్రి పేకాట శిబిరం దాడి చేశారు. పాతపట్నం గ్రామంలోని కోటగుడ్డి కాలనీలో 8 మంది వ్యక్తులు బహిరంగ ప్రదేశంలో పేకాట ఆడుతుండగా సమాచారం తెలుసుకున్న ఎస్ఐ తన సిబ్బందితో కలసి రైడ్ చేసి పట్టుకున్నారు. అనంతరం వారి నుంచి 30,300 నగదుని, పేక ముక్కలను స్వాధీన పరచుకుని కేసు నమోదు చేసినట్లు మీడియాకు ఎస్సై తెలిపారు.