ఎల్ ఎన్ పేట మండలంలోని యంబరాం గ్రామంలో సామూహికంగా రైతులు జిల్లేడు ద్రావణం తయారు చేశారు. జిల్లేడు ద్రావణం వరిలో రసం పీల్చే పురుగు, మొవ్వు పురుగు తెగుళ్లు నివారణకు ఉపయోగిస్తారని యూనిట్ ఇన్చార్జ్ లలిత తెలిపారు. జిగురు అట్టలు, లింగాకర్షక బుట్టలు పొలంలో పెట్టడం వలన పంటకు హాని చేసే పురుగులను నివారించవచ్చునని తెలిపారు. గట్లు పై కంది, బంతి తీగజాతి, ఆకుకూరలు, కూరగాయలు వేయడం రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని ఆమె తెలిపారు. విఏఏ చరిత, రైతులు, ఏ పీ సీ ఎన్ ఎఫ్ సభ్యులు పాల్గొన్నారు.