శ్రీకాకుళం కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును శ్రీకాకుళంలో సోమవారం పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్ గా కేంద్రమంత్రి ఎంపిక కావడంపై అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పాతపట్నం నియోజకవర్గంలో సమస్య లు మంత్రికి వివరించి అభివృద్ధికి సహకరించాలని కోరారు.