డేవిడ్ టీం సేవలు అమూల్యమని, యశోదమ్మ స్వచ్ఛంద సంస్థను స్థాపించి, అనేక కార్యక్రమాలు చేపెట్టడం గొప్పవిషయమని ఎమ్యెల్యే గొండు. శంకర్ శుక్రవారం అన్నారు. అంపోలులో లివర్ వ్యాధితో ఉట్ల. హేమంత్ గత కొన్ని రోజులుగా బాధపడుతున్నారు. మాదారపు టీం సహకారంతో మూడు ఇంజెక్షన్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, ప్రదీప్ బెహరా, రాజశేఖర్ గోడబా తదితరులు పాల్గొన్నారు.