పర్యావరణానికి మేలు చేకూర్చే మట్టి విగ్రహాలను ప్రజలు వినియోగించాలని అవగాహన కల్పిస్తూ.. నియోజకవర్గంలో శుక్రవారం 30వేల మట్టి విగ్రహాలను పంపిణీ చేయనన్నట్టు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. ఈ మేరకు ఆయన తన కార్యాలయం నుంచి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. నగరంలోని పలు కూడళ్ళు తోపాటు కొన్ని గ్రామాల్లోనూ మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేయనున్నట్టు వివరించారు.