మెటీరియల్ కాంపోనెంట్ పనుల్లో మరింత వేగం పెంచాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ బి సుధాకర్ రావు సిబ్బందిని ఆదేశించారు. బుధవారం శ్రీకాకుళం రూరల్ మండలం బైరి గ్రామంలో పర్యటించిన ఆయన గోకులం, సీసీ రహదారుల పనులను పరిశీలించారు. ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధుల ద్వారా మంజూరయ్యాయి అన్నారు. ఆయన వెంట ఏపీవో సీతారాం, జేఈపీ బాలముకుంద బాబు, టి ఏ రత్నాకర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.