కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం జిల్లాలో పర్యటిస్తారని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రమంత్రి గురువారం న్యూఢిల్లీలో బయలుదేరి విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకొని, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఉదయం 10: 30 గంటలకు శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియం కి చేరుకుంటారన్నారు. అనంతరం తన నివాసమైన విజయ నిలయంలో బస చేస్తారని చెప్పారు.