భగవాన్ పురంలో పశు ఆరోగ్య శిబిరం

85చూసినవారు
భగవాన్ పురంలో పశు ఆరోగ్య శిబిరం
టెక్కలి మండలం భగవాన్ పురం గ్రామంలో సోమవారం అధికారులు పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పశువులకు ఏలిక పాముల నివారణ మందులు వేశారు. 18 పశువులకు పొదుగు వాపు, గర్భకోశ చికిత్సలు చేశారు. పశువులలో పాల ఉత్పత్తికి పశుగ్రాసం సాగు, టీఎంఆర్ దాణా ప్రాముఖ్యతను పశువైద్య సిబ్బంది వివరించారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు పి. సుకన్య, పీ. రాజారావు, ఎం. దమయంతి, ఎం. సింహాచలం ఉన్నారు.

సంబంధిత పోస్ట్