భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంగళవారం నందిగాం మండల కాంప్లెక్స్ ఆవరణలోని భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నందిగాం ఎంపీపీ నడుపూరు శ్రీరామమూర్తి, మాజీ జడ్పిటిసి సభ్యులు కురమాన బాలకృష్ణారావుతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు.