సంతబొమ్మల మండలంలోని బోరుబద్ర పంచాయితీ గొదలం గ్రామంలో బుధవారం శ్రీకాకుళం రాగోలు జేమ్స్ హాస్పిటల్ వారు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. జేమ్స్ హాస్పిటల్ డాక్టర్. సంధ్యారాణి మరియు సిబ్బంది ఆధ్వర్యంలో జనరల్ చెకప్ లు జరిగాయి. ముఖ్యఅతిథిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధికార ప్రతినిధి దూపాన. రమణారెడ్డి పాల్గొని మాట్లాడుతూ హాస్పిటల్ వారు నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని మా గ్రామస్తులు సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు.