కొత్తమ్మ తల్లి పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం సూచించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కొత్తమ్మ తల్లి ఆశీస్సులతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహమ్మద్ ఖాన్ తో కలసి గురువారం కోటబొమ్మాళిలోని కొత్తమ్మ తల్లిని దర్శనం చేసుకున్నారు.