పింఛన్ల కోసం బ్యాంకుల వద్ద ఇబ్బందులు పడ్డ వృద్ధులు

81చూసినవారు
పింఛన్ల కోసం బ్యాంకుల వద్ద ఇబ్బందులు పడ్డ వృద్ధులు
కోటబొమ్మాలి మండల కేంద్రంలోని బ్యాంకుల వద్ద పింఛన్లు కోసం భారీగా తరలివచ్చిన వృద్ధులు శుక్రవారం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒకేసారి అధిక సంఖ్యలో పింఛనుదారులు రావడంతో బ్యాంకు వద్ద ఒక్క సారిగా గందరగోళం నెలకొంది. పింఛన్ల సొమ్మును రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఈ నెలలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. వృద్ధులకు ఇలా తీవ్ర ఎండల్లో ఇబ్బందులు పెట్టడం సరికాదని వృద్ధులు మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్