టెక్కలి మండలం రావివలసలో వీధి దీపాల పరిస్థితిపై అధికారులకు ఫిర్యాదు చేయడంతో సిబ్బంది మరమ్మత్తులు చేపట్టినట్లు జనసేన పార్టీ శ్రేణులు తెలిపారు. గ్రామంలో వీధి లైట్లను పరీక్షించిన సిబ్బంది ఆదివారం కొన్ని చోట్ల లైట్లను ఏర్పాటు చేయడంతో సమస్య పరిష్కారం అయిందని జనసేన శ్రేణులు తెలిపారు.