లావేరు మండలం బెజ్జీపురం గ్రామం లో ఈ రోజు రైతులకు వరి లో వచ్చే దోమ పోటు కు నివారణ మార్గంగా తూటి కాడ కషాయం తయారుచేసి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ఒక ఏకరం వరి పంట కి 10 కేజీ తుటి ఆకులు, 15 lt ఆవు మూత్రం తీసుకొని ఒక పాత్ర లో వేసి 3 పొంగులు వచ్చే వరకు వుడకబెట్టి 24 గంటలు చల్లారిన తర్వాత ఒక టాంక్ కి 1/2 చప్పున వేసి పిచికారి చెయ్యాలని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అప్పారావు రాంబాబు అన్నారు.