ఆముదాలవలస మండలం తొగరాం గ్రామ సచివాలయం వద్ద గురువారం గ్రామసభ నిర్వహించారు. గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని సర్పంచ్ తమ్మినేని వాణి సీతారాం అన్నారు. స్థానిక స్వపరిపాలన ద్వారా గ్రామాల అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ సంవత్సరం గాను గ్రామంలో చేయాల్సిన పనులను గుర్తించి వాటి గురించి చర్చించారు. సమావేశంలో వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.