స్థానిక స్వపరిపాలనలో రాజ్యాంగ బద్ధమైనదే గ్రామసభని వెలుగు ఎపిఎం కూర్మారావు అన్నారు. ఆముదాలవలస మండలం కొర్లకోటలో సర్పంచ్ ప్రతినిధి ఎస్ అప్పలనాయుడు ఆధ్వర్యంలో గురువారం గ్రామసభ జరిగింది. రాజ్యాంగబద్ధమైన స్థానిక స్వపరిపాలన ద్వారా గ్రామపంచాయతీల అభివృద్ధికిమార్గం ఏర్పడుతుందని ఏపిఎం అన్నారు. ప్రతిగ్రామంలో కనీసం నాలుగు గ్రామసభలు జరుగుతాయని వాటిలో గ్రామాల అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలు చర్చిస్తామన్నారు.