ఆముదాలవలసలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం

54చూసినవారు
ఆముదాలవలస మండల పరిధిలో ఆదివారం రాత్రి 7: 30 గంటలకు భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం ఎండ వేడితో సతమతమైన ప్రజలకు ఈ వర్షం కారణంగా ఉక్కపోత నుంచి కొంత ఉపశమనం లభించింది. ఉరుములు మెరుపులతో చల్లని గాలులు వీయడంతో వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మారిందని స్థానికులు తెలిపారు. ఋతుపవనాల ప్రభావం ప్రారంభం కావడంతో హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్