నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక శ్రీకాకుళం జిల్లా కన్వీనర్, అడ్వకేట్ మోహనరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఆమదాలవలస జూనియర్ సివిల్ జడ్జ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కార్యాలయం వద్ద రాజ్యాంగ దినోత్సవానికి సంబంధించిన కరపత్రం ఆవిష్కరణ నిర్వహించారు. ఆమదాలవలస బార్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.