ఇంటింటా కషాయాల తయారీలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది

644చూసినవారు
ఇంటింటా కషాయాల తయారీలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది
లావేరు మండలం బెజ్జిపురం యూనిట్ బొంతుపేట గ్రామం లో మంగళవారం ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వరిలో దోమపోటు నివారణ కోసం తూటి కాడ కషాయం ఇంటింటా తయారీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కషాయం సిరి పోట్ట వచ్చే సమయంలో పిచికారి చేసినట్లయితే దోమ పోటు వచ్చే అవకాశం ఉండదని వ్యవసాయ సిబ్బంది రైతులకు అవగాహన కల్పించారు. కషాయాలు తయారు చేసుకోవడం వలన రైతుకు ఎటువంటి ఖర్చు ఉండదని ఏ ఖర్చు లేకుండా దిగుబడి సాధించవచ్చని రైతులకు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్