ప్రవాసాంధ్ర నవ్య కళా పరిషత్ ఆధ్వర్యంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని ఖర్గపూర్ లో నిర్వహించిన అఖిల భారత స్థాయి నాటికల పోటీల్లో ఆమదాలవలస పట్టణానికి చెందిన విశ్రాంత తెలుగు ఉపాద్యాయులు కుప్పిలి వెంకట రాజారావు దర్శకత్వం వహించిన.. పులి కాలం అనే నాటికలో విలన్ పాత్రకుగాను కుప్పిలి శ్యామలరావుకు ఉత్తమ విలన్ అవార్డు.. నటిమణి యస్. దీపికకు ఉత్తమ నటిగా కన్సొలేషన్ బహుమతి లభించగా.. వాటిని సినీనటుడు నాగినీడు అందించారు.