ఎచ్చెర్లలోని ఉన్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఈనెల 23 నుండి బ్యూటీ పార్లర్ నిర్వహణలో 30 రోజులు పాటు ఉచిత శిక్షణ తరగతులు ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ కల్లూరు శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. శిక్షణాకాలంలో ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పించబడునన్నారు. తెలుపు రైస్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. పూర్తి వివరాలకు 7993340407 సంప్రదించాలన్నారు.