నేటితో ముగియనున్న పాలీసెట్ ఆప్షన్ల ఎంపిక

50చూసినవారు
నేటితో ముగియనున్న పాలీసెట్ ఆప్షన్ల ఎంపిక
ఎచ్చెర్లలో పాలిటెక్నిక్ ప్రవేశాలకు సంబంధించి ఏపీ పాలీసెట్-2024 కౌన్సిలింగ్ ఆప్షన్ల ఎంపిక సోమవారంతో ముగుస్తుందని పాలిటెక్నిక్ కళాశాల సమన్వయకర్త మురళీ కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. 11వ తేదీన ఆప్షన్ల మార్పునకు అవకాశం ఉందన్నారు. 13వ తేదీన విద్యార్థులకు కేటాయించిన సీట్లను ప్రకటిస్తామన్నారు. 14వ తేదీ నుంచి క్లాస్ వర్క్ ప్రారంభిస్తామన్నారు. గత నెల 27వ తేదీ నుంచి 2, 307 మంది కౌన్సిలింగ్కి హాజరైయ్యారు.

సంబంధిత పోస్ట్