కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. టీడీపీ అధికారంలోకి వచ్చిందన్న కోపంతో ఆ పార్టీ కార్యకర్తను కొందరు దారుణంగా హతమార్చారు. కొడవళ్లతో నరికి చంపారు. ఈ ఘటన వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లిలో జరిగింది. మృతుడు టీడీపీ కార్యకర్త గిరినాథ్ చౌదరిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుల్ని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.