జిల్లాలో టెట్ పరీక్ష నిర్వహన అక్టోబర్ 3వ తేదీన నుండి ఉంటాయని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. టెట్ పరీక్షలు ఆన్ లైన్ ద్వారా నిర్వహణ జరుగుతుందన్నారు. ఎచ్చెర్ల లో రెండు, నరసన్నపేట లో ఒక పరీక్ష కేంద్రం బరంపురంలో మూడు పరీక్ష కేంద్రాలలో నిర్వహణ జరుగుతుందన్నారు. పరీక్షలు ఆన్ లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సిబిటి)ను అక్టోబర్ 3వ తేదీ నుండి అక్టోబర్ 21వ తేదీ వరకు ఉంటాయని తెలిపారు.