స్కిల్ హబ్ సెంటర్ లో ఉచిత ఉపాధి శిక్షణా కోర్సులు

1474చూసినవారు
స్కిల్ హబ్ సెంటర్ లో ఉచిత ఉపాధి శిక్షణా కోర్సులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణాాభివృద్ధి సంస్థ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఏర్పా టు చేస్తున్న స్కిల్ హబ్ సెంటర్ల లో ఉపాధితో కూడిన ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా ఇచ్చ్చాపురం నియోజకవర్గం లోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ-బారువ స్కిల్ హబ్ నందు కోర్స్ లను ప్రారంభిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ వి సలీం భాష తెలియజేసారు. డెబిట్ రికవరీ ఏజెంట్ కోర్స్ కు బీకామ్ డిగ్రీ / ఇంటర్ (సి. ఈ. సి) విద్యార్హత కలిగి 18-27 వయసున్న స్త్రీ, పురుషులు అర్హులు. ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్ కోర్స్ కు ఇంటర్మీడియట్ లేదా ఆపైన విద్యార్హత కలిగి 18-27 ఏళ్లలోపు వయసున్న స్త్రీ, పురుషులు అర్హులని పేర్కొన్నారు. కోర్స్ పూర్తీ చేసిన వారికి సర్టిఫికెట్ తో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబడునన్నారు. స్కిల్ హబ్ లో శిక్షణ పొందేందుకు వారి వివరాలను కింద ఇవ్వబడిన గూగుల్ ఫాం లో నమోదుచేసుకోగలరు కోరారు. https: //forms. gle/DrysnuFKr7m6Pde36

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్