స్కిల్ హబ్ సెంటర్ లో ఉచిత ఉపాధి శిక్షణా కోర్సులు

1770చూసినవారు
స్కిల్ హబ్ సెంటర్ లో ఉచిత ఉపాధి శిక్షణా కోర్సులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో టెక్కలి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నందు ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ రెండవ బ్యాచ్ ను ప్రారంభిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ టి గోవిందమ్మ , జిల్లా నైపణ్యాభివృద్ధి అధికారి పి. బి. సాయి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కోర్స్ కు 12th నుంచి ఆపైన విద్యార్హత కలిగి 18-30ఏళ్ల లోపు వయసున్న స్త్రీ, పురుషులు మాత్రమేఅర్హులని పేర్కొన్నారు. శిక్షణ పూర్తి చేసిన అనంతరం వారికి సర్టిఫికేట్ తో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పారు. రిజిస్ట్రషన్ కోసం అభ్యర్థులు 24-06-2023 తేదీ లోపల కళాశాల లో ఉన్న సెమినార్ హల్ దగ్గరకు హాజరు కాగలరని తెలియజేశారు. వివరాల కోసం 9493290012, 7013365031 ఫోన్ నంబరులకు సంప్రదించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్