కలకత్తాలో జరిగిన తైక్వాండో పోటీల్లో ఇచ్చాపురంకి చెందిన జ్ఞాన భారతి పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థిని పాలేపు దివ్య కి 40 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ వచ్చింది. ఈ సందర్భంగా గురువారం ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని స్కూల్ సెక్రటరీ జోహార్ ఖాన్ ప్రశంస పత్రాన్ని, మెడల్ బహుకరించారు. సీఈఓ మాట్లాడుతూ మరింత ఉన్నత స్థాయికి వెళ్లి పథకాలు తేవాలని స్కూల్ కి ఊరికి మంచి పేరు తీసుకొని రావాలన్నారు.