కవిటి మండలం రామయ్యపుట్టుగలో తహసిల్దార్లు, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, విద్యుత్ అధికారులతో గురువారం ఎమ్మెల్యే అశోక్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. తుఫాన్ దృష్ట్యా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే అశోక్ సూచించారు. నేడు, రేపు వర్షాలు కురుస్తాయని, ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలన్నారు. అధికార సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు.