వృద్ధుడి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన వీఆర్వో
నరసన్నపేట మడపాం గ్రామం వద్ద శనివారం వంశధార నదిలోదూకి ఆత్మహత్య చేసుకోవాలన్న ఓ వృద్ధుడ్ని నరసన్నపేట వీఆర్వో అప్పలనాయుడు అప్రమత్తమై రక్షించారు. కోటబొమ్మాళి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన బొత్స శిమ్మయ్య కుటుంబంలో వచ్చిన సమస్యలతో ఆత్మహత్య చేసుకోవాలని నదిలోకి దిగాడు. అతడి వివరాలు తెలుసుకుని కుటుంబ సభ్యులకు అప్పగించి నట్టు అప్పలనాయుడు తెలిపారు.