పాలకొండ: అనారోగ్యంతో సీపీఐ నేత మృతి

53చూసినవారు
పాలకొండ: అనారోగ్యంతో సీపీఐ నేత మృతి
పాలకొండలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) సీనియర్ సభ్యుడు కామ్రేడ్ సీహెచ్ రమణారావు బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. సీనియర్ నాయకుడు నెల్లి సూర్యనారాయణ, నియోజకవర్గ కార్యదర్శి బుడితి అప్పలనాయుడు తదితరులు రమణారావు మృతదేహానికి నివాళులు అర్పించారు. పాలకొండ పట్టణంలో పేదలకు ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్