సోమవారం యువగళం పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు "పాలకొండ నియోజకవర్గం" ఇంచార్జ్ నిమ్మక జయక్రిష్ణ ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్ర నిర్వహించడం జరిగింది.
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు యువగళం పాదయాత్ర 100వ రోజు సంధర్బంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పాదయాత్రకు సంఘీభావంగా పాలకొండ నియోజకవర్గ కేంద్రంలో వెలగవాడ గ్రామం నుండి చెక్ పోస్ట్ సెంటర్ వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాదయాత్ర చేసిన నిమ్మక జయకృష్ణ.
ఈ యువగళం సంఘీభావ పాదయాత్రలో రాష్ట్ర కార్యదర్శి కర్నేన అప్పలనాయుడు, అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షలు పల్లా కొండబాబు, మాజీ చైర్మన్ పొదిలాపు కృష్ణమూర్తి నాయుడు, రాష్ట్ర సెల్ కార్యదర్శి బిడ్డిక చంద్రరావు, మండల అధ్యక్షులు గండి రామినాయుడు, సవర తోట ముఖలింగం, బోగాపురపు రవినాయుడు, గంటా సంతోష్ కుమార్, ఉదయాన ఉదయ్ భాస్కర్, మరియు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయి నాయకులు, వీరఘట్టం, పాలకొండ, పాలకొండ టౌన్, సీతంపేట, భామిని మండలం కార్యకర్తలు, క్లస్టర్, యూనిట్ ఇంచార్జ్లు, ఐటీడీపి, యువత భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ, ట్రాఫిక్ సమస్యలు రాకుండా పాలకొండ ఎస్ఐ మరియు సిబ్బంది పర్యవేక్షించారు. ఎలక్ట్రానిక్ & ప్రింట్ మీడియా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.