పాలకొండ: కోటదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న జనసేన నాయకులు
పాలకొండలోని కోటదుర్గమ్మ అమ్మవారి ఆలయాన్ని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు గర్భాన సత్తిబాబు బుధవారం సందర్శించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ పూజ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఉత్సవాలు నిర్వహణపై ఆలయ ప్రాంగణంలో కమిటీ సభ్యులతో మాట్లాడి అభినందనలు తెలిపారు. జన సైనికులు సాయికుమార్, విశ్వనాథం ,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.