మందస మండలం కొండలోగాం గ్రామంలోని స్మారక స్థూపం వద్ద ఆదివారం కామ్రేడ్ చిలకమ్మా 29వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ న్యూ డెమోక్రసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాండ్ర ప్రకాష్ మాట్లాడుతూ.. కామ్రేడ్ చిలకమ్మా చూపించిన పోరాట స్ఫూర్తితో ఆదివాసీ ఉద్యమం చరిత్రలో నిలిచిందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల హక్కులను హరిస్తున్నాయని మండిపడ్డారు.