పలాసలో శుక్రవారం వైసీపీ పార్టీ నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని మాజీ మంత్రి అప్పలరాజు ఆధ్వర్యంలో పలాస విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలాస నియోజకవర్గ పరిధిలో వైకాపా నాయకులు భారీగా చేరుకొని విద్యుత్ శాఖ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో కాసేపు ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.