గంజాయి రవాణా చేస్తూ ఒకరు పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకెళ్తే పాతపట్నం ఎస్ఐ బి లావణ్య మంగళవారం తన సిబ్బందితో కలిసి వెహికల్ చెకింగ్ విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ముందస్తు సమాచారంతో అచ్యుతాపురం జంక్షన్ వద్ద, పాతపట్నం గ్రామానికి చెందిన వ్యక్తి 1170 గ్రాముల గంజాయితో వెళుతున్నట్లుగా తెలుసుకొని పట్టుకున్నామన్నారు. అతనిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.