కోదూరు ప్రాధమిక పాఠశాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు

246చూసినవారు
కోదూరు ప్రాధమిక పాఠశాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు
పాతపట్నం మండలం కోదూరు ప్రాధమిక పాఠశాల లో డా. బి. ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రథానోపాధ్యాయులు ఎ. అప్పలస్వామి మాట్లాడుతూ.. ఎంతకాలం జీవించామో ముఖ్యం కాదని ఎంత గొప్పగా, స్పూర్తి గా జీవించామో ముఖ్యమని దీనికి ఉదాహరణ అంబేద్కర్ జీవితమని తనను ఎంతో అణచి వేయాలనుకున్నా అంత ఉన్నతికి చేరి మనకోసం భారత రాజ్యాంగాన్ని అందించిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గోవిందరావు, యూటీఎఫ్ నాయకులు ఎమ్. శంకర్రావు, పి. మోహనరావు, జి, కవీశ్వర్రావు, వివేకానంద యువజన సంఘం ప్రతినిధులు గులాబి అప్పన్న, బి. కుమారస్వామి, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్