పరిసరాలు పరిశుభ్రతతో ఆరోగ్యవంతమైన జీవనం సాగించడానికి దోహద పడుతుందని పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. మంగళవారం స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం చేపట్టారు. పాతపట్నం ఆల్ ఆంధ్ర రహదారి వద్ద మానవహారం చేపట్టారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే గోవిందరావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం ద్వారా పారిశుద్ధ్యం మెరుగు పరచడానికి కృషి చేస్తున్నారని. ప్రధాని ఆశయానికి కృషి చేయాలని కోరారు.