కొత్తూరు మండలం వసప గ్రామంలో ఫెంగల్ తుఫాను కారణంగా కోత కోసిన ధాన్యం ఎక్కడికక్కడే కల్లాల్లో నిలిచిపోయింది. ఈ పరిస్థితి వల్ల రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రైతుల కథనం ప్రకారం, కోత కోసిన ధాన్యాన్ని సకాలంలో ఎండబెట్టి మిల్లుకు పంపించాల్సి ఉండగా, తుఫాను వల్ల అది సాధ్యం కాలేదు. ధాన్యాన్ని తార్పణలతో కప్పినప్పటికీ, వర్షం వల్ల అది తడిచిపోవడానికి అవకాశం ఉంది. ఈ పరిస్థితి పై రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.