పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు, కేంద్ర పౌర విమానయాన శాఖా మాత్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడును ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు. సోమవారం కేంద్ర మంత్రి కార్యాలయంలో ఆయనను కలిసారు. నియోజకవర్గంలోని పలు సమస్యలు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అతి చిన్న వయస్సులో ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్ ఎన్నికై దేశ స్థాయిలో పేరు ప్రాఖ్యాతలు పొందినందుకు అభినందనలు తెలియజేశారు.