నౌగూడలో కమ్యూనిటీ హాల్ నిర్మించాలి

466చూసినవారు
నౌగూడలో కమ్యూనిటీ హాల్ నిర్మించాలి
హిరమండలం పరిధిన గల నౌగూడ గ్రామంలో కమ్యూనిటీ హాలు నిర్మించాలని డి. హెచ్. పి. ఎస్. జిల్లా అధ్యక్షులు యడ్ల గోపి డిమాండ్ చేశారు. ఆదివారం నాడు హిరమండలం నౌగూడ గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నౌగూడ గ్రామానికి ఆనుకొని ఉన్న స్థలం అంబేద్కర్ కమ్యూనిటీ హలు నిర్మాణం కు కేటాయించాలని, గిరిజనుల శ్మశానం ఆక్రమణలు తొలగించి షేడ్ నిర్మించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనార్టీల సమస్యలపై నిరంతరం సీపీఐ పార్టీ అనుబంధ సంఘాలు పని చేస్తున్నాయని ఏ. ఐ. టి. యు. సి. జిల్లా అధ్యక్షులు అనపాన షణ్ముఖ రావు అన్నారు.

కార్మికులు, కష్ట జీవులకు రాజ్యాంగంలో అంబేద్కర్ కల్పించిన హక్కుల సాధనకు పోరాటాలు ఉధృతం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ నాయకులు దేవుదల వెంకట రావు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు కర్రి అమ్మా రావు, బడే కర్రన్నలు పాల్గొన్నారు. ఎల్. కేశవ రావు, కె. నందేష్, డి. చిన్నారావు, జన్ని అప్పారావు, డి వి. రమణ, జన్ని లక్ష్మి, కె. బింజమ్మ, జన్ని అన్నపూర్ణ, సాయమ్మ, వరలక్ష్మి ల ఆధ్వర్యంలో 30 కుటుంబాలు సీపీఐ పార్టీ అనుబంధ సంఘాల్లో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్