స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. ఇటీవల వరుస నష్టాలతో ఒడిదుడుకులను ఎదుర్కొన్న మార్కెట్లు నేడు లాభాల బాటలో కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలతో పాటు పెరిగిన కొనుగోళ్లతో సెన్సెక్స్ ప్రారంభంలోనే 500 పాయింట్లకుపైగా పెరిగింది. మార్కెట్లలో కొనుగోళ్లు కనిపించడంతో సెన్సెక్స్ 80వేల పాయింట్ల మార్క్‌ను దాటింది. దీంతో అల్ట్రాటెక్ సిమెంట్, అపోలో హాస్పిటల్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్ అత్యధికంగా లాభపడ్డాయి.