ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ ముగిసింది. ఉండవల్లిలోని సీఎం నివాసానికి పవన్ కళ్యాణ్ నేడు వెళ్లారు. ఇరువురి మధ్య రెండు గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం సీజ్, బియ్యం అక్రమ రవాణా సహా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక, పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన, సోషల్ మీడియా కేసుల వ్యవహారంతో పాటు నామినేటెడ్ పోస్టుల అంశంపై కూడా చర్చించినట్లు సమాచారం.