రేగిడి మండలం తోకల వలస గ్రామ సచివాలయంలో 45 ఏళ్ల పై బడిన వారందరికీ కరోనా వ్యాక్సినేషన్ టికా వేస్తున్నామని డాక్టర్ సీతారాం, విఆర్ఓ రమేష్, సెక్రెటరీ చిన్నారావు, రాకేష్ లు తెలిపారు. తోకలవలస సచివాలయం పరిధిలో ఉన్న తాటిపాడు, లచ్చన్నవలస, తోకలవలస గ్రామంలో ఉన్న 45 ఏళ్ళ పైబడిన వారందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని పిలుపునిచ్చారు. మూడు రోజుల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ముఖ్యంగా వృద్ధులకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు.